తెలంగాణ

telangana

ETV Bharat / international

'జైషే'పై పాక్​ అసత్యాలు - masood

జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ విషయంలో పాకిస్థాన్​ ప్రభుత్వం చెప్పే మాటలకు, సైన్యం చేసే ప్రకటనలకు పొంతన లేకుండా పోతోంది. తమ దేశంలో జైషే ఉనికే లేదని పాక్​ సైన్యం చెబుతోంది. మసూజ్​ అజార్​ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ విదేశాంగ మంత్రి మహమూద్  ఖురేషీ నాలుగు రోజుల క్రితమే స్పష్టం చేశారు.

'జైషే'పై పాక్​ అసత్యాలు

By

Published : Mar 7, 2019, 9:25 AM IST

అబద్ధాలు చెప్పడంలో పాకిస్థాన్​కు సాటి మరెవరూ లేరని మరోసారి రుజువైంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్​ పాక్​లోనే ఉన్నాడని, ఆరోగ్యం క్షీణించడం వల్ల చికిత్స పొందుతున్నాడని నాలుగు రోజుల క్రితం పాక్​ ప్రభుత్వమే అంగీకరించింది.

పాకిస్థాన్​ సైన్యం ఇందుకు విరుద్ధంగా మాట్లాడుతోంది. తమ దేశంలో జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఉనికే లేదని పాకిస్థాన్​ సైన్యం అధికార ప్రతినిధి మేజర్​ జనరల్​ ఆసిఫ్​ గఫూర్​ బుకాయించారు. పాక్​ ప్రభుత్వం చెప్పే మాటలకు, సైన్యం చేసే ప్రకటనలకు పొంతన లేకుండా పోయింది.

ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయని అజార్​ కొడుకు, సోదరులకు పాక్​ ప్రభుత్వం ముందస్తు నిర్బంధం విధిందింది. జైషే మహ్మద్ సంస్థ ఉనికి తమ దేశంలోనే లేదని ఆ తర్వాతి రోజే ప్రకటించారు ఆసిఫ్​ గఫూర్​.

ABOUT THE AUTHOR

...view details