అఫ్గానిస్థాన్‌లో అశాంతికి కారకుల్లో ఒకరైన తాలిబన్ సంస్థ మాజీ అధ్యక్షుడు ముల్లా అఖ్తర్ మన్సూర్ ఆస్తులను జప్తు చేసింది పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు. రూ. 3.2 కోట్ల విలువైన ఆయన ఆస్తులను వేలం వేసేందుకు నిర్ణయించింది.
మన్సూర్ నేపథ్యం..
నాటి తాలిబన్ల అధ్యక్షుడు, ఒసామా బిన్ లాడెన్ సహచరుడు ముల్లా ఒమర్ 2013లో హతమయ్యాడు. తర్వాత తాలిబన్ల చీఫ్‌గా ఎంపికైన మన్సూర్.. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన సైనిక ఆపరేషన్‌లో మరణించాడు. అతడు తాలిబన్ల కమాండర్‌గా ఉన్న సమయంలో తప్పుడు ధ్రువీకరణలతో కరాచీలో ఆస్తులను కొనుగోలు చేశాడని సమాచారం.