ఎల్ఓసీ వద్ద ఉగ్రశిబిరాలను పునరుద్ధరించిన పాక్ భారత్‌ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ భారీ కుట్ర పన్నుతోంది. నియంత్రణ రేఖ వెంబడి 20 ఉగ్రశిబిరాలను, 20 లాంఛ్ ప్యాడ్లను ఏర్పాటుచేసినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఒక్కో ఉగ్రశిబిరంలో సుమారు 50 మంది వరకు ముష్కరులు ఉన్నట్లు సమాచారం. శీతాకాలం రావడానికి ముందే వీలైనంత మంది ఉగ్రవాదుల్ని భారత్‌లోకి పంపి, దాడులు చేయించాలన్నది పాక్ పథకంగా తెలుస్తోంది.
చొరబడుతూనే ఉన్నారు..
భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ, సరిహద్దుల వెంబడి నిఘా పెంచినప్పటికీ.. చాలా మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతూనే ఉన్నారు.
"జమ్ము కశ్మీర్లో సుమారుగా 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారు. శీతాకాలానికి ముందే మరికొందరు ముష్కరులను భారత్‌లోకి పంపి, దాడులు చేయించడానికి పాక్ కుట్ర పన్నుతోంది."
- దిల్బాగ్సింగ్, జమ్ముకశ్మీర్ డీజీపీ
ఉగ్రకుట్రకు ఆజ్యం
పుల్వామా దాడి తరువాత భారత వైమానిక దళం.. బాలాకోట్‌లోని ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసింది. ఈ చర్యతో భయపడిన పాక్ తాత్కాలికంగా ఉగ్రశిబిరాలను మూసేసింది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసిన నేపథ్యంలో మళ్లీ ఈ ఉగ్రశిబిరాలను పునరుద్ధరించింది.
ఇదీ చూడండి :మరికాసేపట్లో 'రఫేల్' అందుకోనున్న రాజ్‌నాథ్