తెలంగాణ

telangana

ETV Bharat / international

'లక్షిత దాడులు అబద్ధమని భారత్​ ఒప్పుకోవాలి'

భారత సైన్యం తమ ఎఫ్​-16 జెట్​ను కూల్చలేదని బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్​ సైన్యం తాజాగా 2016లో లక్షిత దాడుల జరగలేదని ఆరోపించింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం కచ్చితంగా అంగీకరించాలని వ్యాఖ్యానించింది.

By

Published : Apr 19, 2019, 10:16 AM IST

'లక్షిత దాడులు అబద్ధమని భారత్​ ఒప్పుకోవాలి'

'లక్షిత దాడులు అబద్ధమని భారత్​ ఒప్పుకోవాలి'

పొరుగు దేశం పాకిస్థాన్​ మళ్లీ పాత పాటే పాడింది. పుల్వామా దాడి అనంతరం భారత సైన్యం తమ ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని కూల్చలేదని బుకాయిస్తూనే... 2016లో లక్షిత దాడులూ జరగలేదని ఆరోపించింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అంగీకరించక తప్పదని వ్యాఖ్యానించింది.

బాలాకోట్​లో భారత వాయుసేన జరిపిన దాడుల్లో పాక్​​ పౌరులు, సైన్యానికి ఎలాంటి హాని జరగలేదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్​ పునరుద్ఘాటించిన కొద్ది గంటలకే 2016లో లక్షిత దాడుల జరగలేదని పాక్​ సైన్యం ప్రతినిధి వ్యాఖ్యానించారు.

"2016 లక్షిత దాడులు, ఎఫ్​-16 విమానం కూల్చామన్న భారత్​ ప్రకటనలు అబద్ధాలే. ఆలస్యమైనప్పటికీ భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే."
--- ఆసిఫ్​ గఫూర్​, పాక్​ మేజర్​ జనరల్​.

ఇదీ చూడండి: మేఘన్​​ మార్కెల్​ భారత్​లో ఏం చేశారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details