పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన రెండు భారీ భూకంపాలతో న్యూజిలాండ్‌లో స్వల్పంగా సునామీ వచ్చింది. అయితే పెద్దగా నష్టమేమీ జరగలేదని అధికారులు తెలిపారు.
బిక్కుబిక్కుమంటూ...
పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన రెండు భారీ భూకంపాలతో న్యూజిలాండ్‌లో స్వల్పంగా సునామీ వచ్చింది. అయితే పెద్దగా నష్టమేమీ జరగలేదని అధికారులు తెలిపారు.
బిక్కుబిక్కుమంటూ...
పసిఫిక్ మహా సముద్రంలో 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకు ముందు 7.3 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. మొదటి భూకంపం న్యూజిలాండ్‌కు 1000 కిలోమీటర్లు దూరంలో ఉన్న కెర్‌మాడిక్ దీవుల వద్ద సముద్రంలో 21 కిలోమీటర్ల లోతున, రెండోది 19 కిలోమీటర్ల లోతున సంభవించినట్లు అమెరికా భూభౌతిక సర్వే కేంద్రం తెలిపింది.
గంటల వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించడం వల్ల దక్షిణ పసిఫిక్ ప్రాంతమంతా సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌లోని తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు చేరుకునే క్రమంలో ట్రాఫిక్ అంతరాయాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొన్ని గంటల్లోనే సునామీ ముప్పు తప్పిందని అధికారులు ప్రకటించారు. కానీ తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.