భారతీయ చలన చిత్ర దిగ్గజ నటుడు రాజ్ కపూర్ పూర్వీకుల ఇంటిపై వివాదం నడుస్తోంది. పాకిస్థాన్ పెషావర్‌లో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు అమ్మే ప్రసక్తే లేదని యజమాని తేల్చి చెప్పారు. సాధారణంగా ఆ ప్రాంతంలో అమ్ముడు పోయే రేటు కంటే ప్రభుత్వం చాలా తక్కువ మొత్తానికి వెల కట్టిందని ఆరోపించారు.
'ఆ హీరో ఇల్లు 200 కోట్లు- కోటిన్నరకు ఎలా ఇస్తా?' - రాజ్ కపూర్ ఇంటి యజమాని
ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌కపూర్ ఇంటి కొనుగోలు విషయంలో యజమానికి, ప్రభుత్వానికి మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. పాకిస్థాన్ పెషావర్‌లో ఉన్న ఇంటిని ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ రేటుకు అమ్మడం సాధ్యం కాదని యజమాని తెలిపారు. ఆ ఇంటిని కొనుగోలు చేసి మ్యూజియంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాజ్‌కపూర్‌కు వారసత్వంగా వచ్చిన ఆస్తిని కొనుగోలు చేసి... ఆయన గౌరవార్థం మ్యూజియంగా మార్చాలని స్థానిక ప్రభుత్వం భావించింది. ఇందుకుగాను ఇంటి కొనుగోలుకు రూ. 1.5 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ఇంటి ప్రస్తుత యజమాని హాజీ అలీ సబీర్... ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇవ్వలేనని తెలిపారు. ఆ ప్రాంతంలో సగం మార్లా(272 చ.అ) స్థలమే 1.5 కోట్లకు రావడం లేదని.. సమారు ఆరు మార్లాలు ఉండే ఇల్లు అదే రేటుకు అడగడం దారుణమని పేర్కొన్నారు. మార్కెట్ ధర ప్రకారం రూ.200 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
ఇదీ చూడండి:ఆ దిగ్గజ నటుల భవంతుల్ని కొననున్న పాక్