తెలంగాణ

telangana

ETV Bharat / international

'వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్ల హతం' - అమెరికా వైమానిక దళాలు

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు, అక్కడి ప్రభుత్వానికి మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాము జరిపిన వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతమయ్యారని అఫ్గాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

taliban
తాలిబన్‌

By

Published : Aug 9, 2021, 5:26 AM IST

Updated : Aug 9, 2021, 6:20 AM IST

అఫ్గానిస్థాన్‌లో భద్రతా బలగాలు, తాలిబన్‌ల మధ్య భీకర పోరులో రక్తం ఏరులై పారుతోంది. ఆదివారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల్లో తాము జరిపిన వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతమవగా.. మరో 309 మంది గాయపడ్డారని అఫ్గాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద మొత్తంలో ఆయుధాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. తాలిబన్లపై అమెరికా వైమానిక దళ సాయంతో ఈ దాడులు జరిపినట్లు అఫ్గానిస్థాన్‌ రక్షణ శాఖ పేర్కొంది.

వెనక్కు తగ్గని తాలిబన్లు..

మరోవైపు.. తాలిబన్లు సైతం ఏమాత్రం వెనక్కి తగ్గడకుండా వరుస బెట్టి నగరాలను ఆక్రమించేస్తున్నారు. ఇప్పటికే కీలక ప్రాంతాలైన తఖర్, జాజ్వన్, నిమ్రోజ్ వారి అధీనంలోకి వెళ్లగా.. తాజాగా కీలక కుందూజ్‌ ప్రావిన్స్‌ రాజధానిలోని పలు ప్రాంతాలను వశం చేసుకున్నారు.

ఇదీ చూడండి:'అఫ్గాన్‌ వదిలి వచ్చేయండి-టికెట్లకు రుణం ఇస్తాం'

Last Updated : Aug 9, 2021, 6:20 AM IST

ABOUT THE AUTHOR

...view details