ప్రపంచవ్యాప్తంగా 2019లో 3.3కోట్ల మందికిపైగా నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఎక్కువగా తూర్పు, దక్షిణాసియా, పసిఫిక్ దేశాల్లోనే బాధితులు తమ స్వస్థలాలను వీడి శరణార్థులుగా మిగిలారని తెలిపింది. మొత్తం 2 కోట్ల 50 లక్షల మందికిపైగా ప్రకృతి విపత్తుల కారణంగా, మరో 85 లక్షల మంది.. సంఘర్షణలు, ఇతర అల్లర్లు, హింస కారణంగా అంతర్గతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చిందని యూనిసెఫ్ తన 'లాస్ట్ ఎట్ హోమ్' నివేదికలో స్పష్టం చేసింది.
భారత్లో ఈ సంఖ్య 50 లక్షల కంటే ఎక్కువేనని.. ప్రపంచ దేశాల్లో ఇదే అత్యధికమని తెలిపింది యూనిసెఫ్. దాదాపు 50 లక్షల 18 వేల మంది విపత్తులతో, 19 వేల మంది ఇతర ఘర్షణలు, హింస కారణంగా ఆస్తులు, ఇళ్లు పోగొట్టుకున్నట్లు తన నివేదికలో వెల్లడించింది.
ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, చైనా వరుసగా భారత్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.