అఫ్గానిస్థాన్‌లోని రెండు రాష్ట్రాల్లో ఆ దేశ వాయుసేన జరిపిన దాడుల్లో 30 మందికి పైగా తాలిబన్లు హతమయ్యారు. జజ్వాన్ రాష్ట్రం ముర్గాబ్, హసన్ గ్రామాల్లోని తాలిబన్ల స్థావరాలపై జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు మృతిచెందగా.. 15 మందికి గాయాలైనట్లు ఆ దేశ రక్షణశాఖ మంత్రి స్పష్టం చేశారు. తాలిబన్లకు చెందిన ఐదు వాహనాలు, రెండు బంకర్లు, ఆయుధ సామాగ్రిని ధ్వంసం చేసినట్లు అఫ్గానిస్థాన్ ప్రభుత్వం తెలిపింది.
హెల్మాండ్ రాష్ట్రం.. లష్కర్ ఘా ప్రాంతంలోని తాలిబన్ల స్థావరాలపై జరిపిన దాడుల్లో 14 మంది ముష్కరులు, మరో ఇద్దరు ఇతర దేశానికి చెందిన ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.