తెలంగాణ

telangana

ETV Bharat / international

అర్జెంటీనాలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు - over 2.64 lakh new covid cases repored during single day around the globe

ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2.64 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 4,250 మంది మరణించారు. బాధితుల సంఖ్య 3.57 కోట్లకు చేరువైంది. అమెరికా, రష్యా, బ్రెజిల్​లో కరోనా తీవ్రత కొనసాగుతుండగా.. యూకేలో మళ్లీ విజృంభిస్తోంది.

Global COVID-19 tracker
కరోనా

By

Published : Oct 6, 2020, 8:53 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 2 లక్షల 64 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 4,250 మంది మరణించారు. మొత్తం బాధితుల సంఖ్య మూడు కోట్ల 57 లక్షలకు చేరువైంది.

  • మొత్తం కేసులు- 3,56,95,406
  • మరణాలు-10,45,892
  • కొత్తగా నమోదైన కేసులు-2,64,208
  • కోలుకున్న బాధితులు-2,68,65,091
  • యాక్టివ్ కేసులు-77,84,423

అమెరికాలో కొవిడ్ కల్లోలం సాగుతూనే ఉంది. కొత్తగా 41 వేల మందికి పాజిటివ్​గా తేలింది. మరో 421 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 76 లక్షలకు చేరువైంది. మృతుల సంఖ్య రెండు లక్షల 15 వేలు దాటింది.

బ్రెజిల్​లో 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 398 మంది మరణించారు. రష్యాలో 10,888 కొత్త కేసులు బయటపడగా.. 117 మంది ప్రాణాలు కోల్పోయారు.

యూకేలో కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. ఒక్కరోజే 12,594 మందికి పాజిటివ్​గా తేలింది. 19 మంది మరణించారు. అర్జెంటీనాలోనూ వైరస్ ప్రబలుతోంది. 11,242 కేసులు బయటపడగా.. మొత్తం బాధితుల సంఖ్య 8 లక్షలు దాటింది.

పాలస్తీనాలో కరోనా సెప్టెంబర్​లోనే తీవ్ర స్థాయికి చేరిందని ఆ దేశ రాయబారి తెలిపారు. సెప్టెంబర్​లో రోజుకు వెయ్యి కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 521కి చేరిందని చెప్పారు. మొత్తంగా పాలస్తీనాలో 52,954 కేసులు, 402 మరణాలు నమోదయ్యాయి.

పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...

దేశం కేసులు మరణాలు
అమెరికా 76,79,644 2,15,032
బ్రెజిల్ 49,40,499 1,46,773
రష్యా 12,25,889 21,475
కొలంబియా 8,62,158 26,844
స్పెయిన్ 8,52,838 32,225
అర్జెంటీనా 8,09,728 21,468
దక్షిణాఫ్రికా 6,82,215 17,016
మెక్సికో 7,61,665 79,088
పెరూ 8,29,999 32,834
యూకే 5,15,571 42,369

ABOUT THE AUTHOR

...view details