తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 15లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 89వేలకు చేరింది. అత్యధికంగా అమెరికాలో పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. యూరప్​ దేశాల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది.

By

Published : Apr 9, 2020, 12:30 PM IST

over 15 lakh corona cases reported worldwide
ప్రపంచవ్యాప్తంగా 15లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచదేశాలపై కరోనా విజృంభణ కొనసాగుతోంది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 15,19,195 కేసులు నమోదయ్యాయి. వ్యాధి బారిన పడి మొత్తం 88,529 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికి పైగా ఐరోపాకు చెందినవే. అత్యధికంగా ఇటలీలో 17,669 మంది మృతి చెందారు. 14,797 మరణాలతో అమెరికా రెండోస్థానికి చేరింది.

పాక్​లోనూ విజృంభణ

పాకిస్థాన్​లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం కొత్తగా 248 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,322కి పెరిగింది. మరణాల సంఖ్య 63కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు...

ప్రపంచవ్యాప్తంగా 15లక్షలు దాటిన కరోనా కేసులు

ఇదీ చూడండి: చైనాలో మళ్లీ కరోనా విజృంభణ- కొత్తగా 63 కేసులు

ABOUT THE AUTHOR

...view details