పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఆ దేశ మాజీ రాయబారి అబిదా హుస్సేన్ సంచలన ఆరోపణలు చేశారు. నవాజ్‌తో అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్లాడెన్కు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
"ఒకానొక సమయంలో షరీఫ్‌కు బిన్ లాడెన్ మద్దతు తెలిపాడు. షరీఫ్‌కు ఆర్థికంగా సహాయం చేసేవాడు. ఇది చాలా పెద్ద కథ."
-అబిదా హుస్సేన్, పాకిస్థాన్ మాజీ రాయబారి
ఈ నేపథ్యంలో లాడెన్పైనా కీలక వ్యాఖ్యలు చేశారు హుస్సేన్. లాడెన్ ఒకప్పుడు అత్యంత ప్రజాధరణ పొందిన నాయకుడని.. అమెరికన్లు సైతం ఆయన్ను మెచ్చుకున్నారని వెల్లడించారు. కానీ కొంత కాలం తరువాత అందరు అతన్ని అపరిచితుడిగా భావించారన్నారు.
అబిదా.. షరీఫ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగానూ పనిచేశారు.
10 మిలియన్ డాలర్లు
విదేశాల నుంచి నిధులు సేకరించే సంప్రదాయానికి పునాది వేసింది నవాజ్ షరీఫేనని 'తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్' పార్టీ ఎంపీ ఫరూఖ్ హబీబ్ ఆరోపణలు చేసిన కొద్దిరోజులకే అబిదా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బెనజీర్ భుట్టో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు లాడెన్ నుంచి షరీఫ్ 10 మిలియన్ డాలర్లు తీసుకున్నారని హబీబ్ ఆరోపించారు.
వరుసగా మూడుసార్లు పాక్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన షరీఫ్.. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు లాడెన్ నుంచి డబ్బులు తీసుకున్నట్లు గతంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఇదీ చూడండి:నవాజ్ షరీఫ్‌ను నేరస్థుడిగా ప్రకటించిన పాక్ కోర్టు