సెంట్రల్ నేపాల్ సింధుపాల్‌చౌక్ జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. భారీగా కురిసిన వర్షాల కారణంగా ఇంద్రావతి, మేలమ్చి నదుల్లో వరదలు పోటెత్తాయి. ఫలితంగా ఏడుగురు మృతిచెందగా.. 50 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
"మేలమ్చి, ఇంద్రావతి నదుల్లో భారీగా నీటి శాతం పెరిగినందునే వరదలు సంభవించాయి. హెలంబు ప్రాంతం నుంచి వరద నీటి ప్రవాహం మొదలైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశాం. చాలా మంది గల్లంతయ్యారని సమాచారం అందింది."