భారత్-నేపాల్ మధ్య కొద్ది నెలలుగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్ భూభాగాలను తిరిగి తీసుకుంటామని పునరుద్ఘాటించారు.
జాతీయ అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఓలి. ఆ దేశ విదేశాంగ మంత్రి జనవరి 14న భారత్కురానున్న తరుణంలో ఓలి ఈ మేరకు వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న తరువాత సీనియర్ నేతలు భారత్‌లో పర్యటించటం ఇదే తొలిసారి.
" మహాకాళి నదికి తూర్పున ఉన్న కాలాపాని, లింపుయధుర, లిపులేఖ్ ప్రాంతాలు సుగౌలి ఒప్పందం ప్రకారం నేపాల్‌కు చెందినవి. భారత్‌తో దౌత్యపరమైన చర్చల ద్వారా వాటిని తిరిగి పొందుతాం. జనవరి 14న మా విదేశాంగ మంత్రి భారతలో పర్యటించనున్నారు. ఈ మూడు కీలక ప్రాంతాలను చేర్చుతూ విడుదల చేసిన కొత్త మ్యాప్పైనే ప్రధానంగా చర్చించనున్నారు. "