తెలంగాణ

telangana

ETV Bharat / international

కోడి మెదడు తింటా... అందుకే ఇలా..: 111 ఏళ్ల వృద్ధుడు - Aussie man loves eating chicken brains

ఆస్ట్రేలియాలోనే అత్యంత వృద్ధుడిగా పేరుగాంచిన డెక్స్​టర్ క్రుగర్(111).. తన ఆరోగ్య రహస్యాన్ని చెప్పేశారు. కోడి మెదడును తినటం వల్లనే తాను ఇంతకాలం జీవించి ఉన్నానని చెప్పుకొచ్చారు.

Oldest-ever Aussie man loves eating chicken brains
డెక్స్​టర్ క్రుగర్

By

Published : May 17, 2021, 1:55 PM IST

ఆస్ట్రేలియాలోనే కురు వృద్ధుడిగా పేరు గాంచిన డెక్స్​టర్ క్రుగర్ ప్రస్తుత​ వయస్సు 111 ఏళ్ల 124 రోజులు. ఇప్పటికీ అంత ఆరోగ్యంగా ఉండడం వెనుక రహస్యాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆయన. తాను కోడి మెదడును ఇష్టంగా తింటానని.. అందుకే ఇంతకాలం జీవించి ఉన్నానని, ఇప్పటికీ చురుగ్గా ఉండగలుగుతున్నానని తెలిపారు.

111 ఏళ్ల డెక్స్​టర్ క్రుగర్
డెక్స్​టర్ క్రుగర్(111)
తన జీవిత విశేషాలను మీడియాకు వివరిస్తున్న క్రుగర్
క్రుగర్ ఆత్మకథ

"కోడికి తల ఉంటుందని మనకు తెలుసు.అయితే ఆ తలలో మెదడు ఉంటుంది. అది చాలా సున్నితంగా ఉండే చిన్న పదార్థం." అని శతాధిక వృద్ధుడు క్రుగర్​ చెప్పుకొచ్చారు. తాను గతంలో పశు సంపదను వృద్ధి చేసే విభాగంలో పని చేసేవాడినన్నారు. తన జీవిత విశేషాలను కలిపి ఆత్మకథ కూడా రాశానన్నారు.

గతంలో ఆస్ట్రేలియాలోనే అత్యంత వృద్ధుడిగా ఉన్న క్రిస్టినా కుక్​( 114) 2002లో మరణించారు.

ఇదీ చదవండి :ఫోన్​ లాక్కున్న కోతి.. చివరికి ఏమైంది?

ABOUT THE AUTHOR

...view details