కార్లు, వాహనాలు గాల్లో లేవడం సినిమాల్లో చూసుంటాం. ఫైట్లు, ఛేజింగ్ సీన్లలో వాహనాలు ఎగిరేలా చేసేందుకు భారీ క్రేన్లు వినియోగిస్తుంటారు. అయితే సినిమాలో యాక్షన్ సీన్లను తలపించేలా చైనాలోని ఆయిల్ ట్యాంకర్ ప్రమాదం జరిగింది. ఝెజియాంగ్ రాష్ట్రంలోని వెన్లింగ్ నగరం సమీపంలోని 'షెన్యాంగ్-హైకో' ఎక్స్ప్రెస్ వేలో.. శనివారం ఓ భారీ ఆయిల్ ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో మంటలు అంటుకున్న ట్యాంకర్ ఎగిరిపడిన వీడియో నెట్టింట చక్కర్లుకొడుతోంది.
రీల్ కాదు రియల్.. గాల్లో ఎగిరిన ఆయిల్ ట్యాంకర్ - oil tanker flying in the air
తూర్పు చైనాలో శనివారం ఓ భారీ ఆయిల్ ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో 18 మంది చనిపోగా.. 166 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వీడియో: రీల్ కాదు రియల్.. గాల్లో ఎగిరిన ఆయిల్ ట్యాంకర్
ఇప్పటికే ఈ ప్రమాదంలో 18 మంది చనిపోగా.. 166 మంది క్షతగాత్రులయ్యారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.