జూన్ 1న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం నేపథ్యంలో సన్నాహక చర్యలపై బ్రిక్స్ కూటమిలోని ఉన్నతాధికారులు విస్తృత చర్చలు జరిపారు. ఈ సమావేశాలు మే 25 నుంచి 28 వరకు జరిగాయి. కరోనా వేళ భద్రత, ఆర్థికవ్యవస్థ.. తదితర వాటిపైనే సమావేశం జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. జూన్1న వర్చువల్‌గా జరగబోయే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
కొవిడ్‌పై బ్రిక్స్ ఉన్నతాధికారుల విస్తృత చర్చలు
బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం జూన్ 1న జరగనున్న క్రమంలో.. కూటమిలోని ఉన్నతాధికారులు విస్తృత చర్చలు జరిపారు. సన్నాహక చర్యలపై సమీక్షించారు. కొవిడ్-19 నేపథ్యంలో భద్రత, ఆర్థికవ్యవస్థ.. తదితర అంశాలపై చర్చించారు.
బ్రిక్స్
బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్య దేశాలుగా ఉన్నాయి.
ఇదీ చదవండి :అమెరికా రక్షణ మంత్రితో జై శంకర్ భేటీ