అఫ్గానిస్థాన్ కాందహార్ రాష్ట్రంలో ఓ సూసైడ్ కార్ బాంబర్ చేసిన దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర వైద్యాధికారి అష్రఫ్ నదేరీ తెలిపారు. మైవాండ్ జిల్లాలోని పోలీస్ స్థావరంపై ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. మృతి చెందిన వారిలో సైనికులు, పౌరులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ దాడిలో 40 మందికి పైగా గాయపడ్డట్లు చెప్పారు.
అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి- నలుగురు మృతి - అఫ్గాన్ సూసైడ్ బాంబర్ దాడి
అఫ్గాన్‌లో ఉగ్ర దాడి జరిగింది. కాందహార్ రాష్ట్రంలో ఓ ముష్కరుడు ఆత్మాహుతి దాడికి పాల్పడగా.. నలుగురు మరణించారు. పోలీసు స్థావరంపై ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఏ ఉగ్ర సంస్థ ప్రకటించుకోలేదు.

అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి- నలుగురు మృతి
ఆదివారం రాత్రి జరిగిన ఈ దాడిలో సమీపంలోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఈ ఘటనకు ఏ ఉగ్రసంస్థ ఇంతవరకు బాధ్యత ప్రకటించుకోలేదు. కానీ, తాలిబన్లే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. 2001 నుంచి ఈ రాష్ట్రం ఉగ్రవాదులకు స్థావరంగా ఉంటూ వస్తోంది.