అఫ్గానిస్థాన్- కాబుల్‌లో బాంబు పేలిన ఘటనలో ఆరుగురు పౌరులు మరణించారు. వీరిలో ఓ మహిళ, చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
తూర్పు అఫ్గాన్‌లో రహదారిపై ప్రయాణిస్తోన్న ఓ వాహనం రోడ్డు పక్కనే పడిఉన్న బాంబును ఢీ కొనడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ఘాజ్ని రాష్ట్రానికి చెందిన తాలిబన్ తిరుగుబాటుదారులే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని ఆ రాష్ట్ర గవర్నర్ వాహిదుల్లా జమజదా అనుమానం వ్యక్తం చేశారు.