అఫ్గానిస్థాన్ కాబుల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
కాబుల్‌లోని ఓ విద్యాకేంద్రం వెలుపల పేలుడు జరిగినట్లు అఫ్గానిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి తరీఖ్ అరియన్ వెల్లడించారు. ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి లోనికి ప్రవేశిస్తుండగా.. భద్రతా సిబ్బంది అడ్డుకున్న సమయంలో ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనకు తామే కారణమని ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు.