శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సతో పాటు ఆ దేశ రక్షణ మంత్రితో సమావేశమయ్యారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంపై ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శాంతి నెలకొల్పేందుకు ఇరుదేశాలు పరస్పరం ఏకాభిప్రాయానికి వచ్చాయని వెల్లడించారు.
'ఈ నేపథ్యంలో మోదీ తరపున శుభాకాంక్షలు తెలిపారు డోభాల్. పరస్పర సహకారంలో పురోగతి సాధించడానికి ఇరుదేశాల నేతల మధ్య జరిగిన వర్చువల్ ద్వైపాక్షిక సమ్మిట్‌ను గుర్తుచేసుకున్నారు' అని శ్రీలంకలోని భారతీయ ఉన్నతాధికారులు ట్వీట్ చేశారు.