జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అనంతరం.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ బజ్వా.. నియంత్రణ రేఖను సందర్శించారు. పాక్ దళాలను కలుసుకొని భద్రతా పరమైన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
'నియంత్రణ రేఖ వద్ద సైనికులను పాక్ ఆర్మీ చీఫ్ కలుసుకున్నారు. అక్కడి పరిస్థితుల గురించి సమీక్షించారు.'