తెలంగాణ

telangana

ETV Bharat / international

దక్షిణ కొరియాకు కిమ్ సోదరి గట్టి హెచ్చరిక! - అమెరికా

దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరికలు పంపారు. త్వరలో అమెరికాతో జరిగే సైనిక విన్యాసాలను రద్దు చేసుకోవాలని కోరారు. లేదంటే ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.

KIM KOREA
కిమ్ సోదరి హెచ్చరిక!

By

Published : Aug 2, 2021, 12:19 PM IST

అమెరికా- దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా వ్యతిరేకత వ్యక్తం చేసింది. విన్యాసాలను రద్దు చేసుకోవాలని దక్షిణ కొరియాను కోరింది. సమీప భవిష్యత్తులో ఉభయ కొరియాల మధ్య నేతల స్థాయిలో శిఖరాగ్ర సదస్సు జరిగే అవకాశంపై అనుమానం వ్యక్తం చేసింది. దక్షిణ కొరియా ఏ నిర్ణయం తీసుకుంటుందోనని తాము గమనిస్తూ ఉంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరి కిమ్ యో జోంగ్ పేర్కొన్నారు.

"సంయుక్త మిలిటరీ విన్యాసాలు ఉత్తర కొరియా అత్యున్నత నాయకత్వాన్ని తక్కువ అంచనా వేసేలా ఉన్నాయి. దక్షిణ కొరియా ఓ ముందడుగు వేసి ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో విన్యాసాలు జరగడం వల్ల.. భవిష్యత్​లో ఉభయ కొరియాల మధ్య సంబంధాలపై నీలి నీడలు కమ్ముకుంటాయి. దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలకు ప్రాధాన్యం ఇస్తుందో, లేదా ఇతర కఠిన నిర్ణయం తీసుకుంటుందో అన్న విషయాన్ని మా ప్రభుత్వం, సైన్యం గమనిస్తూ ఉంటుంది."

-కిమ్ యో జోంగ్, కిమ్ సోదరి, 'కొరియా వర్కర్స్ పార్టీ' సెంట్రల్ కమిటీ వైస్ డైరెక్టర్

సరిహద్దుల్లో ఏడాది కాలంగా నిలిచిపోయిన కమ్యూనికేషన్ లైన్లను పునరుద్ధరించడాన్ని గొప్ప విషయంగా చెప్పుకోవద్దని దక్షిణ కొరియాకు కిమ్ యో జోంగ్ హితవు పలికారు. ఇది కేవలం భౌతికంగా జరిగిన మార్పులేనని అన్నారు. దీని ఆధారంగా ఊహాగానాలు పెంచుకుంటే నిరాశే ఎదురవుతుందని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:యుద్ధానికి సిద్ధం కండి: కిమ్ ఆదేశం

ABOUT THE AUTHOR

...view details