సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడమే ప్రధాన అజెండాగా కీలక సమావేశం నిర్వహించారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. ప్రస్తుత, భవిష్యత్ కార్యాచరణపై ఆ దేశ సైనిక ఉన్నతాధికారులతో చర్చించారు.
సైనికాధికారులతో కిమ్ భేటీ.. అందుకేనా? - Kim Jong Un latest news
ఉత్తర కొరియా సైనిక ఉన్నతాధికారులు ఆ దేశ అధినేత, సైనిక విభాగాల ఛైర్మన్ కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో దేశ సైనిక సామర్థ్యం బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది.

సైనికాధికారులతో కిమ్ భేటీ.. అందుకేనా?
అమెరికా-కొరియా చర్చలపై ఇటీవల కిమ్ సోదరి.. కిమ్ యో జోంగ్ స్పష్టత నిచ్చారు. అమెరికాతో చర్చలు జరగటం కష్టమేనని సూత్రప్రాయంగా వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో సైనికాధికారులతో కిమ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి:ట్రంప్‌తో భేటీపై కిమ్ సోదరి ఏమన్నారంటే?