కరోనా మహమ్మారిని అదుపులో తీసుకువచ్చి విజయం సాధించినందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అభినందిస్తూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ లేఖ రాశారు మహమ్మారిపై విజయం సాధించేందుకు చేసిన ప్రయత్నాలను కొనియాడారని ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది.
జిన్‌పింగ్‌కు కిమ్ లేఖ- అసలు ఉద్దేశం అదే?
కరోనాను విజయవంతంగా నియంత్రించినందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అభినందించారు. ఈ మేరకు కిమ్ లేఖ పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కరోనా సంక్షోభం తర్వాత చైనాతో వాణిజ్యాన్ని పునరుద్ధరించేందుకు దీనిని తొలి అడుగుగా అభివర్ణించాయి దక్షిణ కొరియా వర్గాలు.
జిన్‌పింగ్‌కు అభినందనలు తెలిపిన కిమ్
అంతర్జాతీయ ఆంక్షలు, ప్రభుత్వ విధానాల వైఫల్యంతో ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయినట్లు దక్షిణ కొరియా నిఘా వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం ఈ సంక్షోభం తారస్థాయికి చేరుకోగా... చైనాతో వాణిజ్యాన్ని పునరుద్ధరించేందుకు ఉత్తర కొరియా ప్రయత్నాలు ప్రారంభించినట్లు వెల్లడించాయి.