తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2020, 1:31 PM IST

Updated : Jul 10, 2020, 1:36 PM IST

ETV Bharat / international

ట్రంప్​తో​ భేటీపై కిమ్​ సోదరి ఏమన్నారంటే?

ఈ ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్ ఉన్​‌ మధ్య భేటీ జరిగే అవకాశాల్లేవని స్పష్టం చేశారు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్.

North Korean leader's sister says Kim-Trump summit unlikely
కిమ్​- ట్రంప్​ భేటీ జరగదు: కిమ్ యో జంగ్

ఉత్తరకొరియా, అమెరికా స్నేహబంధానికి మరింతగా బీటలు పడుతున్నాయి. ఈ ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్- ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్​ ఉన్​ సమావేశం కావాల్సి ఉండగా.. తాజాగా ఆ భేటీపై స్పష్టతనిచ్చారు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్. తన సోదరుడు అగ్రరాజ్యం అధ్యక్షుడిని కలవడం కష్టమేనని వెల్లడించారు. అమెరికా వైపు నుంచి ఆశించిన మేర ఫలితాలు రాకపోవడమే కారణమని ఆమె పేర్కొన్నట్లు ప్యాంగ్యాంగ్​ అధికారిక మీడియా తెలిపింది. ప్రస్తుతం ఉత్తర కొరియాలో అత్యంత శక్తిమంతమైన మహిళగా ఉన్నారు యో జోంగ్‌.

రెండేళ్ల క్రితం సింగపూర్‌లో కిమ్-ట్రంప్ తొలిసారి సమావేశమై పలు కీలకమైన అంశాలపై చర్చలు జరిపారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాలను.. పూర్తిగా నిలిపివేయాలని అమెరికా ఒత్తిడి చేస్తుండగా, తమ దేశంపై ఆంక్షలు తొలగించాలని ప్యాంగ్యాంగ్‌ కోరుతోంది.

ఇరుదేశాల మధ్య 2019 ఫిబ్రవరిలో జరిగిన చివరి శిఖరాగ్ర సమావేశంలో ఆంక్షలు తొలగించేందుకు ట్రంప్‌ నిరాకరించడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.

ఇదీ చూడండి: దక్షిణ కొరియాకు కిమ్​ సోదరి బెదిరింపులు

Last Updated : Jul 10, 2020, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details