కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న ఉత్తర కొరియా.. గత 4 రోజులుగా వరుస క్షిపణి ప్రయోగాలతో (north korea missile test) చెలరేగిపోతోంది. బుధవారం.. రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి దక్షిణ కొరియాను కవ్వించిన ఉత్తర కొరియా నియంత (north korea president) కిమ్ జోంగ్ ఉన్.. గురువారం మరో క్షిపణిని పరీక్షించి ఇరుదేశాల ఉద్రిక్తలకు (north korea south korea conflict) మరింత ఆజ్యం పోశారు.
north Korea missile test: ఉత్తర కొరియా దూకుడు- రైలు నుంచి క్షిపణి ప్రయోగం - ఉత్తర కొరియా న్యూస్
వరుస క్షిపణి ప్రయోగాలతో (north korea missile test) దక్షిణా కొరియాతో కవ్వింపులకు పాల్పడుతోంది ఉత్తర కొరియా. గురువారం తొలిసారి రైలు నుంచి క్షిపణిని ప్రయోగించింది.
ఉత్తరకొరియా తొలిసారి ఓ రైలు నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. దట్టమైన పర్వత మధ్య ప్రాంతంలో ఉన్న రైలు వద్దకు.. ఆయుధ వ్యవస్థను తరలించి అక్కడి నుంచి విజయవంతంగా... క్షిపణిని పరీక్షించినట్లు చెప్పింది. రైలు నుంచి గాల్లోకి దూసుకెళ్లిన బాలిస్టిక్ క్షిపణి.. 800 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఢీకొట్టినట్లు కొరియన్ మీడియా పేర్కొంది. రైలు నుంచి వరుసగా రెండు క్షిపణులను ఉత్తరకొరియా పరీక్షించినట్లు తెలిపింది.
ఇదీ చూడండి:కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు- పోటాపోటీగా క్షిపణి ప్రయోగాలు