తెలంగాణ

telangana

ETV Bharat / international

తగ్గని ఉత్తరకొరియా.. మరో బాలిస్టిక్​ క్షిపణి ప్రయోగం

North Korea Missile Test: ఉత్తరకొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ ఏడాదిలో ఉత్తరకొరియా ఇప్పటివరకు తొమ్మిది ప్రయోగాలను చేపట్టింది.

North Korea Missile Test
మరో క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా

By

Published : Mar 5, 2022, 9:09 AM IST

North Korea Missile Test: ప్రపంచదేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఉత్తరకొరియా తన క్షిపణి ప్రయోగాలను ఆపట్లేదు. రష్యా-ఉక్రెయిన్​ యుద్ధంతో నెలకొన్న పరిస్థితుల్లో కూడా కిమ్​ సర్కారు వెనక్కి తగ్గట్లేదు. తాజాగా మరో క్షిపణిని శనివారం ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ క్షిపణిని సముద్రంలోకి ప్రయోగించినట్లు తెలిపింది. మరోవైపు దీనిపై స్పందించిన జపాన్​ రక్షణ శాఖ.. ఉత్తరకొరియా ప్రయోగించినది బాలిస్టిక్​ క్షిపణిగా భావిస్తున్నట్లు పేర్కొంది.

గత కొన్ని నెలలుగా వరుస క్షిపణి ప్రయోగాలు చేపడుతున్న ఉత్తర​కొరియా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు తొమ్మిది ప్రయోగాలను చేపట్టింది. అణ్వాయుధాల కట్టిడిపై 2019లో అమెరికాతో జరిపిన చర్చలు విఫలమైన తర్వాత ఉత్తరకొరియా మరింత జోరు పెంచింది. తమ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేలా ఈ ప్రయోగాలు చేపడుతోంది.

ఇదీ చూడండి :Ukraine Crisis: 'డెడ్‌హ్యాండ్‌'- అణుదాడికి అత్యంత రహస్య వ్యవస్థ

ABOUT THE AUTHOR

...view details