North Korea missile test: ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను ఏమాత్రం ఆపడంలేదు. తాజాగా మరో క్షిపణిని ప్రయోగించింది. ఇది ఏ శ్రేణికి సంబంధించినదే సమాచారం మాత్రం వెల్లడించలేదు. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులు, న్యూక్లియర్ ఆయుధాల పరీక్షలపై ఆంక్షలు ఉన్నాయి. 2022లో ఉత్తరకొరియా చేసిన తొలి ఆయుధ పరీక్ష ఇదే. ఈ విషయాన్ని జపాన్‌కు చెందిన కోస్ట్‌గార్డ్ సిబ్బంది తొలిసారి గుర్తించారు.
ఉత్తర కొరియా చేసిన పరీక్షను దక్షిణ కొరియా, అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ విషయాన్ని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్స్ కూడా ధ్రువీకరించింది. జపాన్ రక్షణశాఖ మంత్రి నుబవు కిషి దీనిపై స్పందిస్తూ 'బాలిస్టిక్ క్షిపణి 500 కి.మీ. దూరం ప్రయాణించింది. ఇది దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు' అని పేర్కొన్నారు.