North Korea Missile Test 2022: ఉత్తర కొరియా మరోమారు క్షిపణి ప్రయోగాలు చేపట్టి ఉద్రిక్తతలు రాజేసింది. బాలిస్టిక్ మిసైల్‌ను ఉత్తరకొరియా ప్రయోగించినట్టు దక్షిణ కొరియా, జపాన్ సైనిక అధికారులు వెల్లడించారు. జపాన్ సముద్రంలోకి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు చెప్పారు. కొన్ని నెలలుగా ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలను విస్తృతం చేసింది. అమెరికాపై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఉత్తరకొరియా ఈ ప్రయోగాలు చేపట్టిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరో క్షిపణి ప్రయోగంతో ఉద్రిక్తతలు రాజేసిన కిమ్ దేశం
North Korea Missile Test 2022: బాలిస్టిక్ మిసైల్‌ను ఉత్తరకొరియా ప్రయోగించినట్టు దక్షిణ కొరియా, జపాన్ సైనిక అధికారులు వెల్లడించారు. జపాన్ సముద్రంలోకి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు చెప్పారు.
క్షిపణి ప్రయోగాలు
తమ దేశాన్ని అమెరికా ద్వేషభావంతో చూస్తోందన్న ఉత్తర కొరియా.. అణు పరీక్షలు ముమ్మరం చేసేందుకు నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. గత నెలలో ఏడు రౌండ్ల క్షిపణి ప్రయోగాలు చేపట్టిన కిమ్ ప్రభుత్వం మిత్రదేశం చైనాలో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమైన తర్వాత నిలిపివేసింది. ఇటీవలె క్రీడలు ముగియగా.. మళ్లీ క్షిపణి ప్రయోగాలు ప్రారంభించినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:30కి.మీ నడిచి.. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో గడిపి.. తెలుగు విద్యార్థి ఆవేదన