తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉత్తర కొరియా రాకాసి క్షిపణి ప్రయోగం.. ఉలిక్కిపడ్డ అమెరికా.. - Ukraine crisis

North Korea Missile Launch: ఉత్తరకొరియా కొత్త తరహా ఖండాంతర క్షిపణిని (ఐసీబీఎం) ప్రయోగించింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్యకు వ్యతిరేకంగా నాటో కూటమి నేతలు సమావేశమవుతున్న వేళ.. కిమ్​ చర్య అంతర్జాతీయ సమాజాన్ని.. ముఖ్యంగా అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది. దీన్ని రాకాసి క్షిపణిగా అభివర్ణిస్తున్నారు.

North Korea Missile Launch
క్షిపణి

By

Published : Mar 25, 2022, 7:11 AM IST

North Korea Missile Launch: ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్యకు వ్యతిరేకంగా నాటో కూటమి నేతలు సమావేశమవుతున్న వేళ.. ఉత్తరకొరియా కొత్త తరహా ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం) ప్రయోగించి అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసేంది. అగ్రరాజ్యం అమెరికాను ఆందోళన కలిగించేలా చేసింది. సుదూర లక్ష్యాలను సునాయాసంగా ఛేదించే ఈ ఐసీబీఎం అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా ఢీ కొట్టగలదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని రాకాసి క్షిపణిగా అభివర్ణిస్తున్నారు.

ఉత్తరకొరియా అమ్ములపొదిలో అత్యంత సూదూర లక్ష్యాలను ఛేదించే సత్తా ఈ క్షిపణికి ఉందని పేర్కొంటున్నారు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఈ ఏడాది అరంభం నుంచి వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుడు మీదున్న ఉత్తరకొరియా ఐసీబీఎం ప్రయోగించడం గత ఐదేళ్లతో ఇదే తొలిసారి. చివరిసారిగా 2017లో పరీక్షించింది. దక్షిణ కొరియా సైనిక వర్గాల ప్రకారం గురువారం ప్రయోగించిన క్షిపణి 1,080 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్‌ సముద్ర జలాల్లో పడింది. ఇది చాలా శక్తిమంతమైనదని, దాదాపు 6,200 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్లిందని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 71 నిమిషాలు గగనతలంలో ఉంది. తమను అణ్వస్త్ర దేశంగా గుర్తించాలని, తమపై ఆంక్షలు తొలగించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఉత్తరకొరియా డిమాండ్‌ చేస్తోంది. అందులో భాగమే తాజా ప్రయోగమని తెలుస్తోంది. తాజా కవ్వింపు చర్యకు దక్షిణకొరియా దీటుగా స్పందించింది. పలు క్షిపణులను ప్రయోగించింది. జపాన్‌, అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. క్షమించరాని కవ్వింపు చర్యగా జపాన్‌ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు ఉత్తరకొరియా ధిక్కరిస్తోందని అమెరికా ఆక్షేపించింది.

ఇదీ చదవండి:ఉక్రెయిన్​ అంశంపై ఐరాసలో ఓటింగ్​.. భారత్​ దూరం

ABOUT THE AUTHOR

...view details