తెలంగాణ

telangana

ETV Bharat / international

ముప్పు తలెత్తితే అణ్వస్త్రాల మోహరింపు:కిమ్​ - కిమ్​ జోంగ్​ ఉన్​

ఉత్తర కొరియా అధికార వర్కర్స్​ పార్టీ 75వ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా భారీ అధునాతన ఆయుధాలతో సైనిక కవాతు నిర్వహించింది. ఇందులో అత్యాధునిక ఖండాంతర క్షిపణులు, జలాంతర్గాముల నుంచి ప్రయోగించే క్షిపణులు ఉన్నట్లు సమాచారం. ఈ​ సందర్భంగా శత్రు దేశాలకు పరోక్ష హెచ్చరికలు చేశారు కిమ్​ జోంగ్​ ఉన్​. తమకు ముప్పు తలెత్తితే బలమైన అణ్వస్త్ర బలగాలను పూర్తిస్థాయిలో మోహరించి తగిన ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.

North Korea
ఉత్తర కొరియా సైనిక కవాతు

By

Published : Oct 11, 2020, 5:12 AM IST

తమకు ముప్పు తలెత్తితే బలమైన అణ్వస్త్ర బలగాలను పూర్తిస్థాయిలో మోహరించి తగిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​. అమెరికా పేరు ప్రస్తావించకుండానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. అధికార వర్కర్స్​ పార్టీ ఆఫ్​ కొరియా 75వ ఆవిర్బావ వేడుకలను శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర కొరియా ఘనంగా నిర్వహించుకుంది. దీని వీడియోను శనివారం విడుదల చేశారు. భారీ సైనిక కవాతులో ఈ మేరకు శత్రు దేశాలకు పరోక్ష హెచ్చరికలు పంపారు.

ఉత్తర కొరియా సైనిక కవాతు

" శత్రు శక్తుల నుంచి పెరుగుతున్న అణ్వాయుధ బెదిరింపులతో సహా అన్ని ప్రమాదకరమైన ప్రయత్నాలు, బెదిరింపు చర్యలను అరికట్టడానికి, స్వీయ ఆత్మరక్షణ కోసం మేము యుద్ధ నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేసే చర్యలను కొనసాగిస్తాము. "

- కిమ్​ జోంగ్​ ఉన్, ఉత్తర కొరియా అధినేత.

దక్షిణ కొరియాకు శుభాకాంక్షలు తెలిపారు కిమ్​. కరోనా మహమ్మారి నుంచి పొరుగు దేశం త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్​ నుంచి దేశాన్ని, తమను రక్షించుకుంటున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పునరుద్ఘాటించారు కిమ్​.

భారీ ఆయుధాల ప్రదర్శన..

డౌన్​ నగరంలో ఉత్తర కొరియా భారీ సైనిక కవాతు నిర్వహించినట్లు దక్షిణ కొరియా మీడియా నివేదించింది. అధికార వర్కర్స్​ పార్టీ ప్రతి ఐదవ, పదవ వార్షికోత్సవాల్లో దేశ సైనిక శక్తిని చూపించే అతిపెద్ద కవాతులు నిర్వహిస్తుంది. శుక్రవారం నిర్వహించిన పరేడ్​లో అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్​ మిసైల్స్​ (ఐసీబీఎం), జలాంతర్గముల నుంచి ప్రయోగించగలిగే బాలిస్టిక్​ క్షిపణులు(ఎస్​ఎల్​బీఎం), ఇతర భారీ ఆయుధాలను ప్రదర్శించినట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి.

ఇదీ చూడండి: శత్రు దేశానికి ఉత్తర కొరియా హెచ్చరిక.. కారణం ఇదే!

ABOUT THE AUTHOR

...view details