ఉత్తర కొరియా ఇవాళ సముద్రం వైపు పలు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా భద్రతా దళాలు చెబుతున్నాయి. ముంచోన్ ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణులు... 'స్వల్ప శ్రేణి క్రూయిజ్ మిస్సైల్స్' అయ్యుండొచ్చని జాయింట్స్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అభిప్రాయపడింది.
తాత జయంతి సందర్భంగా...!
ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, ప్రస్తుత దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాత అయిన కిమ్ ఇల్ సుంగ్ 108వ జయంతి బుధవారం. మరోవైపు ఉత్తర కొరియా.. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటరీ ఎన్నికలు కూడా రేపే జరగనున్నాయి. వీటికి ఒక్క రోజు ముందు ఈ అణు సంపన్న దేశం క్షిపణి పరీక్షలు నిర్వహించడం గమనార్హం.
తరచుగా ప్రయోగాలు...