తమ దేశ అణ్వాయుధ నిరోధక శక్తిని పెంపొందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇదే సమావేశంలో చెప్పిన ఆయన.. మరోమారు అణు శక్తిపై మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
8 రోజుల పాటు సాగిన వర్కర్స్ పార్టీ సమావేశం మంగళవారం ముగిసింది. తన తొమ్మిదేళ్ల పాలనలో అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు కిమ్. మహమ్మారితో సరిహద్దుల మూసివేత, వరదలు, తుపాన్ల కారణంగా పంట నష్టంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినటం, అమెరికా ఆంక్షలు వంటివి ఉన్నాయి.
" మన అణ్వాయుధ శక్తిని బలోపేతం చేసేందుకు బలమైన సైనిక సామర్థ్యాలను పెంచుకునేలా అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా.. ఆర్థిక వ్యవస్థను నియంత్రించటం, వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలి. రసాయన, మెటల్ పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇవ్వాలి. "