నూంగర్.. పశ్చిమ ఆస్ట్రేలియాలో కొన్ని వందల మంది మాట్లాడే భాష. ప్రస్తుతం అంతరించిపోతున్న ఈ భాషకు పునర్జీవం పోసేందుకు సమాయత్తమయ్యారు ఆ దేశ వాసులు. ఇందుకు విద్యార్థులకు ఈ భాషలో పాఠాలు కూడా బోధిస్తున్నారు. ఎంతో ప్రాచుర్యం పొందిన షేక్స్పియర్ రచన 'మక్బెత్'ను సైతం ఈ భాషలోకి అనువదించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంగీత కళాకారుల నుంచి నటులు, దర్శకుల వరకు ఆర్ట్స్ కమ్యూనిటీ మొత్తం నేతృత్వం వహిస్తోంది.
ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు కైలీ బ్రాక్నెల్, ఆమె భర్త క్లింట్. షేక్స్పియర్ ఇతర రచనలను అనువాదం చేసి ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు అందించారు కైలీ.
"ఈ భాషను మాట్లాడకూడదని బలవంతం చేయడం, ఉపయోగించడం మానేయడం వల్ల అంతరించే స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఈ 2020లో దీని పునరుద్ధరణకు కృషి చేయాల్సిన అవసరం చాలా ఉంది."