తెలంగాణ

telangana

ETV Bharat / international

'కశ్మీర్​లో మార్పు వస్తేనే భారత్​తో చర్చలు' - కశ్మీర్​లో పరిస్థితులు సద్దుమనిగే వరకు చర్చలు లేవని స్పష్టం

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ భారత్​పై మరోసారి  విమర్శలు చేశారు. కశ్మీర్​లో పరిస్థితులు మారే వరకు భారత్​తో ఎలాంటి చర్చలు జరగవన్నారు.

'కశ్మీర్​లో మార్పు వస్తేనే భారత్​తో చర్చలు'

By

Published : Oct 8, 2019, 5:21 AM IST

Updated : Oct 9, 2019, 12:27 AM IST

'కశ్మీర్​లో మార్పు వస్తేనే భారత్​తో చర్చలు'

కశ్మీర్​ పరిస్థితుల్లో మార్పు వచ్చేంతవరకు భారత్​తో చర్చలు జరగవని పాకిస్థాన్​ ​ప్రధాని ఇమ్రాన్​ఖాన్ పునరుద్ఘాటించారు. పాక్ పర్యటనకు వచ్చిన అమెరికా కాంగ్రెస్ సెనెటర్లతో ఈ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్.

అమెరికా సెనెటర్లు క్రిస్​వాన్ హోలెన్​, మ్యాగీ హసన్​లు ఆదివారం పాక్​ ఆక్రమిత కశ్మీర్​ను సందర్శించారు. దీనిపై వారి పరిశీలనలను పంచుకునేందుకు సోమవారం పాక్​ ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్​తో చర్చల ప్రస్తావన వచ్చింది.

భారత్​-పాక్​ మధ్య చర్చలకు తానే అతిపెద్ద మద్దతుదారుడినని ఇమ్రాన్ అన్నారు.​ అయితే కశ్మీరీల పరిస్థితి మారేవరకు చర్చలు జరగవని స్పష్టం చేశారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినంత కాలం పాకిస్థాన్​తో చర్చలు జరిగే ప్రసక్తే లేదని భారత్​ తేల్చిచెప్పింది.

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్​ 370ని భారత్​ రద్దు చేసినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్​ అనేక మార్లు తన దురుసు ప్రవర్తనను బయటపెట్టారు. అణుయుద్ధంపై భారత్​కు హెచ్చరికలు జారీ చేశారు. అయితే అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్​ అంశాన్ని లేవనెత్తి మద్దతు కూడగట్టుకుందామనుకున్న ప్రతిసారీ పాకిస్థాన్​కు భంగపాటే ఎదురైంది.

ఇదీ చూడండి: 'ఇమ్రాన్​జీ... విమానం ఇచ్చి పంపితే అలా చేస్తారా?'

Last Updated : Oct 9, 2019, 12:27 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details