చైనాలో మూడో రోజూ కరోనా కేసులు సున్నా కరోనాకు కేంద్రబిందువైనా చైనాలో వరుసగా మూడోరోజూ ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. అయితే వుహాన్‌లో కరోనా కారణంగా మరో ఏడుగురు మృతి చెందారు. చైనాలో మొత్తం మరణాల సంఖ్య 3,255కు చేరింది.
చైనావ్యాప్తంగా శుక్రవారం 36 అనుమానిత కేసులు నమోదయ్యాయని, విదేశాల నుంచి వచ్చినవారిలో కొత్తగా 41మందికి కరోనా సోకినట్లు చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. అయితే వీరిలో చైనీయులు ఉన్నారా? లేరా? అనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు.
చైనాలో ఇప్పటివరకు మొత్తం 81,008 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 71,740మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 6,013 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. దేశంలో 106 అనుమానిత కేసులున్నాయి.
హాంకాంగ్‌లో 256 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు చనిపోయారు. మకావ్‌లో 17 కేసులు, తైవాన్‌లో 135 కేసులు, రెండు మరణాలు నమోదైనట్లు చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.
ఇదీ చూడండి: శ్వేతసౌధాన్ని తాకిన కరోనా.. ట్రంప్ సేఫ్