తెలంగాణ

telangana

ETV Bharat / international

వియత్నాంలో శుక్రవారం కేసుల సంఖ్య 'సున్నా' - వియత్నాంలో కరోనా వైరస్

ప్రపంచదేశాలపై కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉద్ధృతంగా విరుచుకుపడుతోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 67 లక్షల మందికి వైరస్ సోకగా 8.78 లక్షలమంది మృత్యువాత పడ్డారు.

COVID-19
కరోనా మహమ్మారి

By

Published : Sep 5, 2020, 10:01 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. నానాటికి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 2.67 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా ధాటికి 8,78,958 మంది మృతిచెందారు. 1.89 కోట్ల మంది కోలుకున్నారు.

అగ్రరాజ్యంలో..

అమెరికాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజులో 52,853 కేసులు నమోదయ్యాయి. మొత్తం సంఖ్య 63.89 లక్షలకు చేరింది. దేశంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి 1,92,11 మంది మృత్యువాతపడ్డారు.

బ్రెజిల్​లోనూ భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 45 వేల మందికిపైగా వైరస్ బారినపడగా మొత్తం బాధితుల సంఖ్య 40.91 లక్షలకు పెరిగింది. 1.25 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

నాలుగో స్థానంలో మెక్సికో..

మెక్సికోలో కరోనా మరణాల సంఖ్య భారీగా ఉంది. 66,851 మరణాలతో అమెరికా, బ్రెజిల్, భారత్​ తర్వాత నాలుగో స్థానంలో ఉంది. కొత్తగా దాదాపు 6 వేల కేసులు నమోదు కాగా.. మొత్తం 6.16 లక్షల మందికి వైరస్ సోకింది.

రష్యాలో స్థిరంగా..

రష్యాలో వైరస్ ఉద్ధృతి తగ్గినా స్థిరంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 5,110 మందికి కరోనా నిర్ధరణ అయింది. దేశంలో మొత్తం బాధితులు 10.15 లక్షల మంది ఉన్నారు. రష్యాలో మరణాల రేటు కూడా అదుపులో ఉంది. ఇప్పటివరకు 17,649 మంది మరణించారు.

వియత్నాంలో ఇలా..

కరోనా కట్టడిలో విజయవంతమై ప్రపంచ దేశాల మన్ననలను పొందుతోంది వియత్నాం. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు అక్కడ ఒక్క కేసు నమోదు కాలేదు. ఇప్పటివరకు వియత్నాంలో మొత్తం 1,049 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

పెరూ, చిలీ, కొలంబియా, సౌదీ, బంగ్లాదేశ్, అర్జెంటీనా, ఫిలిప్పీన్స్​ దేశాల్లో వైరస్​ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

దేశం మొత్తం కేసులు మృతులు కోలుకున్నవారు
అమెరికా 63,89,057 1,92,111 36,35,854
బ్రెజిల్ 40,91,801 1,25,584 32,78,243
రష్యా 10,15,105 17,649 8,32,747
పెరూ 6,76,848 29,554 4,98,523
కొలంబియా 6,50,062 20,888 4,98,221
దక్షిణాఫ్రికా 6,35,078 14,678 5,57,818
మెక్సికో 6,16,894 66,329 4,30,287

ఇదీ చూడండి:భారత్​లో 'స్పుత్నిక్​' టీకా తయారీకి రష్యా చర్చలు

ABOUT THE AUTHOR

...view details