తెలంగాణ

telangana

ETV Bharat / international

'కర్తార్​పుర్​ యాత్రికులకు పాస్​పోర్ట్ అవసరం లేదు' - pakistan news

కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవం దగ్గర పడుతున్న సమయంలో కొన్ని వెసులుబాట్లను కల్పించనున్నట్లు ప్రకటించారు పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​. యాత్రికులకు పాస్​పోర్ట్​, ముందస్తు నమోదు అవసరం లేదని తెలిపారు.

ఇమ్రాన్​

By

Published : Nov 1, 2019, 10:26 AM IST

Updated : Nov 1, 2019, 12:45 PM IST

'కర్తార్​పుర్​ యాత్రికులకు పాస్​పోర్ట్ అవసరం లేదు'

కర్తార్​పుర్​లో గురుద్వారా సాహిబ్​ను దర్శించుకునేందుకు పాస్​పోర్ట్​ అవసరం లేదని పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ ప్రకటించారు. ఏదైనా ఒక గుర్తింపు పత్రం చూపిస్తే సరిపోతుందని తెలిపారు.

ఇమ్రాన్​ ట్వీట్

"భారత్​నుంచి కర్తార్​పుర్​ వచ్చే యాత్రికుల కోసం రెండు అంశాల నుంచి మినహాయింపు ఇచ్చాం. మొదటిది.. పాస్​పోర్టు అవసరం లేదు. ఏదైనా ఒక గుర్తింపు పత్రం సరిపోతుంది. రెండవది.. 10 రోజుల ముందు పేరు నమోదు చేసుకునే అవసరం లేదు. అంతేకాకుండా నడవా ప్రారంభోత్సవం నాడు గురునానక్​ 550వ జయంతి సందర్భంగా ఎలాంటి రుసుము వసూలు చేయం."

-ఇమ్రాన్​ ఖాన్​, పాక్​ ప్రధాని

కర్తార్​పుర్​ నడవా భారత్​లోని డేరా బాబా నానక్ నుంచి దర్బార్​ గురుద్వారా సాహిబ్​ను కలుపుతుంది. ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దు నుంచి కేవలం 4 కిలోమీటర్లు ఉంటుంది.

నడవా ఒప్పందం

కర్తార్​పుర్ నడవా ఒప్పందంపై భారత్​-పాక్​ గతవారం సంతకం చేశాయి. వీసా రహిత ప్రయాణానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే యాత్రికులు 20 డాలర్ల చొప్పున సేవా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 5వేల మందిని మాత్రమే అనుమతి ఇస్తారు.

ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్​.. నా కొడుకు పేరు భోపాల్​'

Last Updated : Nov 1, 2019, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details