తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్​కు కిమ్​ సర్కార్​ తీవ్ర హెచ్చరిక - ఉత్తరకొరియా అణు కార్యక్రమం

ఉత్తర కొరియాను... అమెరికా భద్రతకు పెద్ద ముప్పుగా బైడెన్​ అభివర్ణించడంపై కిమ్ సర్కార్ మండిపడింది. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

kim jong un
కిమ్ జాంగ్ ఉన్

By

Published : May 2, 2021, 11:03 AM IST

అధ్యక్షుడి హోదాలో అమెరికా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి జో బైడెన్‌ గతవారం తొలిసారి చేసిన ప్రసంగాన్ని తప్పుబట్టింది ఉత్తర కొరియా. అమెరికా 'చాలా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది' అని హెచ్చరించింది.

ఉత్తర కొరియా, ఇరాన్​ అణు కార్యక్రమాలు అమెరికాతో పాటు ప్రపంచ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని బైడెన్ అభిప్రాయపడ్డారు. అలాగే ఈ దేశాలపై దౌత్యపరంగా కఠినమైన ఆంక్షలు విధించే అంశాన్ని మిత్ర దేశాలతో చర్చించి నిర్ణయించనున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది.

"గత యాభై ఏళ్లుగా ఉత్తర కొరియా పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని ప్రతిబింబించేలా బైడెన్ ప్రకటన ఉంది. శత్రు విధానాలను అమలు చేయాలనే ఆయన ఉద్దేశం స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉత్తర కొరియా విధానం మారనుంది. అమెరికాపై ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం చాలా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది."

-క్వాన్ జోంగ్ గన్, ఉత్తర కొరియా విదేశాంగ అధికారి

అయితే ఉత్తర కొరియా ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో క్వాన్ పేర్కొనలేదు. ఈ ప్రకటన.. బైడెన్​పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమేనని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభివప్రాయపడుతున్నారు.

అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరేలా అధునాతన అణ్వాయుధాలను అభివృద్ధి చేయనున్నట్లు జనవరిలో కిమ్ ప్రకటించారు.

ఇవీ చదవండి:'ఆయుధాలను పక్కనపెట్టండి- చర్చలు జరపండి'

ముప్పు తలెత్తితే అణ్వస్త్రాల మోహరింపు:కిమ్​

అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉత్తర కొరియా: కిమ్​

ABOUT THE AUTHOR

...view details