తెలంగాణ

telangana

ETV Bharat / international

కిమ్ కొత్త పంథా- యూట్యూబ్​ ద్వారా గుప్త సందేశాలు - యుట్యూబ్

యూట్యూబ్ వేదికగా ఉత్తర కొరియా రహస్య సమాచారాన్ని తమ గుఢచారులకు చేరవేసిందని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. 'రేడియో ప్యాంగాంగ్' యూట్యూబ్ ఖాతా నుంచి ఈ సమాచారం ప్రసారమైనట్లు తెలిపింది. రేడియోల ద్వారా ఇలాంటి సందేశాలను పంపించడం ఉత్తర కొరియాకు కొత్త కాకపోయినా... యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా చేరవేయడం ఇదే తొలిసారని తెలుస్తోంది.

NKorea broadcasts encrypted spy message on YouTube
కిమ్ కొత్త పంథా- యూట్యూబ్​ ద్వారా గుప్త సందేశాలు

By

Published : Aug 31, 2020, 2:27 PM IST

ఉత్తర కొరియా శనివారం నిగూఢ సమాచారాన్ని యూట్యూబ్​లో ప్రసారం చేసింది. దక్షిణ కొరియాలోని గూఢచారుల కోసమే ఈ గుప్త సందేశాన్ని పంపించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఉత్తర కొరియా ప్రభుత్వానికి చెందిన 'రేడియో ప్యాంగాంగ్' యూట్యూబ్ ఖాతా నుంచి ఈ సమాచారం వెల్లడైంది.

'నెం. 719 సాహసయాత్ర ఏజెంట్లకు రిమోట్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ సమాచార సాంకేతిక రివ్యూ అసైన్​మెంట్​' అంటూ ఓ మహిళా వ్యాఖ్యాత​ ఈ సమాచారాన్ని చదివినట్లు దక్షిణ కొరియాకు చెందిన యొన్​హప్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. "564వ పేజీలో నెంబర్ 23, 479వ పేజీలో నెంబర్ 19" అనే వాఖ్యాలను పదేపదే ఉచ్ఛరించినట్లు వివరించింది. అయితే వీడియో సందేశంలో నెంబర్లను ప్రసారం చేయలేదని యొన్​హప్ న్యూస్ పేర్కొంది.

యూట్యూబ్​లో కొత్తగా

ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి ఉత్తర కొరియా ఇలాంటి గుప్త సందేశాలను రేడియో ద్వారా పంపించిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా మార్చిలోనూ ఇదే తరహాలో సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబ్ ద్వారా ఇలాంటి సమాచారం పంపడం మాత్రం ఇదే తొలిసారి.

ABOUT THE AUTHOR

...view details