అమెరికా అధ్యక్ష పోరులో ఎవరు గెలిచినా... ఇరాన్‌కు వారు తలొగ్గాల్సిందేనని అన్నారు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ. ఓ వాటర్ పైప్‌లైన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
" నేడో..రేపో.. అమెరికా ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. కానీ, మాకు ఎవరు అధ్యక్షుడవుతారనేది ముఖ్యం కాదు. పోరులో ఎవరు నెగ్గినా వారు ఇరాన్ ప్రజలకు తలొగ్గాల్సిందే ".
-హసన్ రౌహాని, ఇరాన్ అధ్యక్షుడు.