తెలంగాణ

telangana

ETV Bharat / international

ఈ నెల 29న భారత్​కు శ్రీలంక నూతన అధ్యక్షుడు - November 29 at the invitation of Prime Minister Narendra Modi,

శ్రీలంక నూతన అధ్యక్షుడు గొటాబయ రాజకప్స ఈ నెల 29న భారత్​లో పర్యటించనున్నారు. ప్రధాని ఆహ్వానం మేరకు భారత్​లో రాజపక్స పర్యటిస్తారని విదేశాంగమంత్రి జైశంకర్​ తెలిపారు.

ఈ నెల 29న భారత్​కు శ్రీలంక నూతన అధ్యక్షుడు

By

Published : Nov 20, 2019, 5:18 AM IST

Updated : Nov 20, 2019, 10:57 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 29 భారత్​లో పర్యటించనున్నారు శ్రీలంక నూతన అధ్యక్షుడు గొటాబయ రాజపక్స. ఈ విషయాన్ని భారత విదేశాంగమంత్రి జై శంకర్​ వెల్లడించారు.

రెండు రోజలు శ్రీలంక పర్యటనలో ఉన్న జై శంకర్​... రాజపక్సతో సమవేశమయ్యారు. అధ్యక్షుడికి మోదీ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపిన లేఖను రాజపక్సకు అందించారు.

రాజపక్స నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇదే ఆయనకు తొలి అధికారిక పర్యటనయ్యే అవకాశముంది. రాజపక్స నాయకత్వంలో ఇరు దేశాల మధ్య అభివృద్ధి, శాంతి, భద్రతా పరమైన అంశాలు మరింత బలోపేతమవుతాయని ఇరు వర్గాలు భావిస్తున్నాయి.

లంక ఎన్నికల ఫలితాలనంతరం ఆదివారం నాడు ప్రధాని మోదీ స్వయంగా రాజపక్సకు ఫోన్​ ద్వారా భారత ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలిపారు. రాజపక్స నాయకత్వంలో లంకలో శాంతి భద్రతలు మెరుగుపడి ప్రజలు అభివృద్ధి చెందుతారని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని.

ఇదీ చూడండి: టికెట్టు తీసుకోలేదని బస్సు నుంచి తోసేశాడు!

Last Updated : Nov 20, 2019, 10:57 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details