తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్​: న్యూజిలాండ్ ఆరోగ్యమంత్రి రాజీనామా - డేవిడ్ క్లార్క్

న్యూజిలాండ్​ ఆరోగ్యమంత్రి డేవిడ్​ క్లార్క్ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్​డౌన్ నిబంధనలను వ్యక్తిగతంగా ఉల్లంఘించడమే ఇందుకు కారణం.

New Zealand's health minister resigns after virus blunders
కరోనా ఎఫెక్ట్​: న్యూజిలాండ్ ఆరోగ్యమంత్రి రాజీనామా

By

Published : Jul 2, 2020, 1:52 PM IST

వ్యక్తిగతంగా లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించిన న్యూజిలాండ్ ఆరోగ్యమంత్రి డేవిడ్ క్లార్క్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

"నేను ఓ ఇడియట్​. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘించాను. ప్రజల ఆగ్రహాన్ని నేను అర్థం చేసుకోగలను. అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను."

- డేవిడ్ క్లార్క్​, న్యూజిలాండ్​ ఆరోగ్యమంత్రి

తన పదవికి రాజీనామా చేసిన డేవిడ్ క్లార్క్... మంత్రిగా కరోనా నియంత్రణ కోసం శాయశక్తులా కృషి చేసినట్లు పేర్కొన్నారు. అయితే తాను పార్లమెంట్​ సభ్యుడిగా కొనసాగాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

సర్వత్రా ప్రశంసలు

కరోనా నియంత్రణలో న్యూజిలాండ్ సాధించిన విజయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. అయితే స్వయంగా ఆరోగ్యమంత్రే లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించడంపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి.

ఇటీవల విదేశాల నుంచి వచ్చిన కొంతమందికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా, కనీసం క్వారంటైన్​లో ఉంచకుండా దేశంలోకి అనుమతించారు. ఈ విషయంలో కూడా డేవిడ్​పై విమర్శలు వచ్చాయి.

అలాగే ఏప్రిల్​లో తన కుటుంబ సభ్యులతో కలిసి డేవిడ్​ 19 కి.మీ మేర బీచ్​ వాక్ చేశారు. ఓ వైపు కరోనా నియంత్రణ కోసం ప్రజలంతా కఠిన లాక్​డౌన్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం కోరుతున్న సమయంలో... స్వయంగా ఆరోగ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

మౌంటైన్ బైకింగ్ కోసం డేవిడ్ తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ పార్కుకు డ్రైవింగ్ చేస్తూ వెళ్లారు. ఈ విషయంలోనూ... తాను నిబంధనలు ఉల్లంఘించినట్లు డేవిడ్​ ఒప్పుకున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే..

కరోనా మహమ్మారితో పోరు సాగిస్తున్న ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో... ఆరోగ్య రంగంలో జరిగే తప్పులను భరించడం కష్టమని న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ తేల్చిచెప్పారు. మొదట ఆమె... అసోసియేట్ ఆర్థిక మంత్రిగా ఉన్న డేవిడ్ క్లార్క్​ను బాధ్యతల నుంచి తప్పించి, కేబినెట్ ర్యాంకింగ్ స్థాయినీ తగ్గించారు. అయినా ప్రజాగ్రహం తగ్గలేదు. దీనితో చివరకు ఆయన రాజీనామాను అంగీకరించారు. తరువాత విద్యామంత్రిగా పనిచేస్తున్న క్రిష్ హాప్​కిన్స్​కు ఆరోగ్యమంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

మరో మూడు నెలల్లో న్యూజిలాండ్​ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జెసిండా ఆర్డెర్న్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పుడు (లిబరల్ లేబర్ పార్టీ) జెసిండా తీసుకున్న చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. అయితే ఇటీవల స్వదేశంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో నేషనల్ పార్టీ నాయకుడు టాడ్​ ముల్లర్ బలం పుంజుకున్నట్లు స్పష్టమైంది.

ఇదీ చూడండి:ఇద్దరు భారతీయ అమెరికన్లకు అరుదైన గౌరవం

ABOUT THE AUTHOR

...view details