న్యూజిలాండ్ వెల్లింగ్టన్లో ఓ ఉగ్రవాది(New Zealand terror attack) బీభత్సం సృష్టించారు. ఓ సూపర్ మార్కెట్లోకి చొరబడి ఆరుగురు వ్యక్తులను కత్తితో పొడిచి గాయపరిచాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... అతడ్ని మట్టుబెట్టారు.
ఈ ఘటనను న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ ఖండించారు. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనేనని చెప్పారు. శ్రీలంకకు చెందిన సదరు ముష్కరుడికి.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ముష్కరుల దాడిని ఎదుర్కొనేందుకు తమ నిఘా విభాగాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు.