న్యూజిలాండ్‌లో మళ్లీ కరోనా సామాజిక వ్యాప్తి కలకలం మొదలైంది. దాదాపు రెండు నెలల అనంతరం తొలిసారి ఈ రకమైన కేసు నమోదైంది. ఐరోపా నుంచి న్యూజిలాండ్‌కు వచ్చిన ఓ 56 ఏళ్ల మహిళలో ఈ వైరస్ ఆనవాళ్లను గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆశ్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు.
అందరు ప్రయాణికుల్లానే.. సదరు మహిళ కూడా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్నట్లు బ్లూమ్‌ఫీల్డ్ చెప్పారు. జనవరి 13న ఆమె ఇంటికి బయలుదేరేముందు నిర్వహించిన పరీక్షలో ఆమెకు నెగెటివ్‌గానే నిర్ధరణ అయినట్లు పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత ఆమెకు పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ఆరోగ్య అధికారులు ఈ వైరస్‌పై జన్యుపరీక్షలు జరుపుతారని వెల్లడించారు. మామూలు వైరస్ కంటే ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించగలదని అంచనా వేస్తున్నారు.