Cockroach in Ear: ఒకటి, రెండు కాదు.. ఏకంగా 3 రోజుల పాటు ఓ వ్యక్తి చెవిలో తిష్ట వేసింది ఓ బొద్దింక. నరకయాతన అనుభవించిన అతను వైద్య నిపుణుల దగ్గరకు వెళ్లగా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వైద్యులు దానిని బయటకు తీశారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది..
ఆక్లాండ్‌కు చెందిన జేన్ వెడ్డింగ్ అనే వ్యక్తి.. పూల్‌లో స్విమ్మింగ్ చేసి వచ్చి పడుకున్నాడు. తర్వాత చెవిలో ఏదో సమస్యగా అనిపించింది. లోపలకు నీరు పోయిందేమో అని తొలుత తేలిగ్గా తీసుకున్నాడట. కాసేపటికి లోపల ఏదో తిరుగుతున్నట్లు అనిపించగా.. డాక్టర్ దగ్గరికి వెళ్లాడు జేన్.
అతడిని పరిశీలించిన వైద్యుడు.. యాంటీబయాటిక్స్ ఇచ్చి, హెయిర్ డ్రయర్‌తో చెవి లోపల శుభ్రం చేసుకోవాలని సూచించాడు. మళ్లీ సమస్య అనిపిస్తే తిరిగి రావాలని చెప్పి పంపించాడు.