స్పీకర్ ఛైర్లో బుడతడు... నెట్టింట ప్రశంసల జల్లు! - ఫీడ్
న్యూజిలాండ్ పార్లమెంటులో చర్చ జరుగుతోంది. స్పీకర్ ఆ చర్చను నిర్వహిస్తున్నారు. అయితే.. ఆయన ఒడిలో ఒక పసిబాలుడు ఉన్నాడు. ఆ చిన్నారికి పాలుపడుతూ జోకొడుతూ ఉన్నాడా స్పీకర్. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

స్పీకర్ ఛైర్లో బుడతడు... నెట్టింట ప్రశంసల జల్లు!
న్యూజిలాండ్ పార్లమెంట్లో ఓ బుడతడు చేసిన సందడి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయమేంటంటే... న్యూజిలాండ్ ఎంపీ తమతి కాఫీ, ఆమె భర్త టిమ్ స్మిత్ గత నెలలో సరోగసీ ద్వారా ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఎంపీగా ఉన్న ఆమె సభాసమావేశాలకు తన బిడ్డను తీసుకొచ్చారు. హౌస్ స్పీకర్ ట్రెవర్ మల్లార్డ్ ఆ శిశువును చేతిలోకి తీసుకుని బాటిల్‌తో పాలు పట్టించారు. మహిళా ఎంపీ తన బిడ్డను పార్లమెంట్‌కు తీసుకురావడం, స్పీకర్ బాబును లాలించడంపై తోటి ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు.
స్పీకర్ ఛైర్లో బుడతడు... నెట్టింట ప్రశంసల జల్లు!
Last Updated : Sep 27, 2019, 11:14 PM IST