హాంకాంగ్...
హాంకాంగ్‌లో కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రఖ్యాత విక్టోరియా హార్బర్ వద్ద బాణసంచా వెలుగులు చూపరులను కట్టిపడేశాయి.
21:58 December 31
హాంకాంగ్...
హాంకాంగ్‌లో కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రఖ్యాత విక్టోరియా హార్బర్ వద్ద బాణసంచా వెలుగులు చూపరులను కట్టిపడేశాయి.
21:31 December 31
టోక్యోలో మొదలైన సందడి...
జపాన్ రాజధాని టోక్యోలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జపాన్ వాసులు ఆనందోత్సాహాల మధ్య నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
18:48 December 31
అంబరాన్నంటిన ఆస్ట్రేలియా...
ఆస్ట్రేలియాలో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీ హార్బర్‌కు లక్షలాది మంది చేరుకుని నూతన ఏడాదిని ఘనంగా ఆహ్వానించారు. రంగురంగుల బాణాసంచా వెలుగులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రజలంతా కేరింతలతో 2020కి స్వాగతం పలికారు. ఒకరికి ఒకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాణాసంచాను పెద్ద ఎత్తున కాల్చారు. దాదాపు 12 నిమిషాల పాటు బాణాసంచా వెలుగుజిలుగులు 15 లక్షల మంది ప్రేక్షకులను కనువిందు చేశాయి
18:08 December 31
అదిరిన ఆక్లాండ్...
నూతన సంవత్సర వేడుకలు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నుంచి ప్రారంభమయ్యాయి. న్యూజిలాండ్ ప్రజలు 2019కి ఘనంగా వీడ్కోలు పలికి... 2020కి స్వాగతం పలికారు. ఆక్లాండ్‌లోని ప్రఖ్యాత స్కైటవర్ వద్ద ఏర్పాటు చేసిన బాణసంచాను తిలకించేందుకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. సంప్రదాయ రీతిలో శంఖం ఊది... నూతన ఏడాదికి కౌంట్‌డౌన్ ప్రారంభించారు.అనంతరం బాణసంచా కాల్చి కొత్త ఏడాదిని ఆహ్వానించారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొని కేరింతలు కొట్టారు