నూతన సంవత్సర వేడుకలను ఉత్తర కొరియా ఘనంగా నిర్వహించింది. నదీ తీరంలో రంగుల రంగుల వెలుగులుజిమ్మేలా బాణసంచా పేల్చి 2022లోకి అడుగు పెట్టింది.
ఉత్తర కొరియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
21:13 December 31
18:54 December 31
ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. సిడ్నీలో కన్నుల పండువగా బాణసంచా పేల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు ప్రజలు. ఏటా ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. వీటిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచదేశాల నుంచి పర్యటకులు కూడా వస్తుంటారు.
16:37 December 31
న్యూ ఇయర్ వేడుకలు
New year celebrations: ప్రపంచదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. న్యూజిలాండ్ 2022కు స్వాగతం పలికిన తొలిదేశంగా నిలిచింది. అక్కడి ఆక్లాండ్ నగరం అన్ని దేశాల కంటే ముందుగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది.